సంపూర్ణ ఆత్మ దర్శనం పొందిన వ్యక్తి భగవంతుడి దర్శనాన్నే పొందగలుగుతాడు. ఈ క్రమంలో 12 సాధనలు ఉన్నాయన్నాడు శ్రీకృష్ణభగవానుడు. గీతలోని 18వ అధ్యాయం మూడు శ్లోకాలలో (51, 52, 53) వాటిని వివరించాడు. ఈ పన్నెండిటిలో మూడు సాధన చేయగలిగినా ఆత్మబలం పునరుత్తేజం అవుతుంది. ఈ పన్నెండు సాధనల్లో మొదటిది బుద్ధిని పవిత్రంగా ఉంచుకోవడం, రెండోది దృఢనిశ్చయం కలిగి ఉండటం, ఆహారంపై నియంత్రణ, దేహాన్ని, మనస్సును, వాక్కును నియంత్రించడం అనేవి కూడా ముఖ్యమైన సాధనలు.
క్రోధాన్ని దరిచేరనీయక పోవడం, శాంతంగా ఉండేందుకు తీవ్రమైన ప్రయత్నం చేయడమూ సాధనే. వీటిలో కొన్నిటిని సాధన చేసినా మనలో ఆత్మబలం నిండుతుంది. అదే మనకు శ్రీరామరక్ష అవుతుంది. అప్పుడు వారు ఎంతటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొని విజయసీమలకు చేరగలుగుతాం.
– శ్రీ