కోల్కతా : మాస్క్ సరిగా ధరించలేదని అడిగినందుకు ఓ మహిళను వెంటాడి వేధింపులకు గురిచేసిన యువకుడిని కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ శ్యామ్పుకుర్ ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు రాగా ఆమెపై కోపం పెంచుకున్న యువకుడు వెంబడిస్తూ అసభ్య కామెంట్లు చేశాడు. కార్యాలయానికి వెళ్లేందుకు ఆమె ఆటోలో ఎక్కడంతో ఆమెతో పాటు ఆటోలో కూర్చున్న నిందితుడు అసభ్యంగా వ్యవహరించాడు.
గిరీష్ పార్క్ క్రాసింగ్ వద్ద మహిళ ట్రాఫిక్ సిబ్బందికి నిందితుడిపై ఫిర్యాదు చేయగా వారు కంట్రోల్ రూంకు సమాచారం అందించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పింటూ పర్మానిక్గా గుర్తించిన పోలీసులు గతంలోనూ మహిళ పట్ల అతడు ఇదే తీరుగా వ్యవహరించాడని తెలిపారు.