మంగళవారం 19 జనవరి 2021
Crime - Jan 11, 2021 , 18:31:37

క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి

క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి

కోనరావుపేట/రాజన్న సిరిసిల్ల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ రెండు రోజులు గా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నాగారం గ్రామానికి చెందిన అప్పాల ప్రవీణ్ (21) క్రికెట్ ఆడుతూ అకస్మాత్తుగా పడిపోయాడు. గమనించిన తోటి స్నేహితులు ప్రవీణ్‌ను అంబులెన్స్‌లో జిల్లా ఏరియా దవాఖానకు తరలించారు. ఈ క్రమంలో మార్గమధ్యంలోనే ప్రవీణ్ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి చిన్న వయసులోనే మరణించగా తల్లి ఎల్లవ్వ, అన్నయ్య ప్రశాంత్ ఉన్నారు. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

ప్రభుత్వ పథకాల అమలులో ఎంపీడీవోలు కీలకం

మిషన్ భగీరథ పెండింగ్ పనులను పూర్తి చేయండి 

కూతురు పరీక్ష కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు