యాచారం : ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలోని మాల్ గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబందించి ఎస్ఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాల్ గ్రామానికి చెందిన అనురశి పద్మమ్మ అనే వివాహిత ఈ నెల 6వ తేదిన ఇంట్లో ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లి పోయింది. ఆమె భర్త కిష్టయ్య చుట్టుపక్కల గ్రామాల్లో, బంధువుల ఊర్లలో వెతికినా పద్మమ్మ ఆచూకీ తెలియలేదు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. భర్త కిష్టయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పద్మమ్మ ఎత్తు 4.8ఫీట్లు, శరీర రంగు తెలుపు, దుస్తులు తెలుపు, ఎరుపు రంగు చీర, తెలుపు రంగు జాకెట్ ధరించి ఉందని భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు. పద్మమ్మ ఆచూకీ తెలిసిన వారు 9490617313, 9490617242, 9491039119కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.