దారుణం : చేతబడి అనుమానంతో వృద్ధురాలిని కడతేర్చాడు!

చండీఘఢ్ : పంజాబ్‌లోని లుధియానాలో దారుణ ఘటన వెలుగుచూసింది. చేతబడి అనుమానంతో 70 ఏండ్ల మహిళను పొరుగున ఉండే యువకుడు (22) కత్తితో పొడిచి చంపిన ఘటన నగర శివార్లలోని మెహర్బన్ ప్రాంత పరిధిలో చుహర్వాల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. నిందితుడిని జస్పాల్ సింగ్ జసా, బాధితురాలిని స్వరణ్ కౌర్‌గా గుర్తించారు. నిందితుడు, అతడి తల్లి వృద్ధురాలు తమపై చేతబడి చేస్తోందని అనుమానించారు.
శనివారం రాత్రి వృద్ధురాలితో తల్లీ కొడుకులు ఘర్షణ పడ్డారు. బాధితురాలి కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం కౌర్ ప్రార్ధనల కోసం గురుద్వారకు వెళుతుండగా ఆ ప్రాంతంలో మాటువేసిన నిందితుడు కౌర్‌పై కత్తితో దాడి చేశారు. బాధితురాలు చేతబడి చేస్తోందని దుర్భాషలాడుతూ నిందితుడు ఆరుసార్లు ఆమెను కత్తితో పొడిచి పరారయ్యాడు. నిందితుడు జస్పాల్ సింగ్‌ను హత్యకు కుట్రపన్నిన అతడి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime news
- Punjab
- Witchcraft
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

