Cyber Fraud : దేశవ్యాప్తంగా గత ఏడాదిగా సైబర్ నేరాలు విపరీతంగా పెరగుతున్నాయి. ఆన్లైన్ వేదికగా చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు అమాయకులే లక్ష్యంగా అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ వృద్ధురాలు తన క్రెడిట్ కార్డ్ అన్‌లాక్ చేసే క్రమంలో స్కామర్ల చేతిలో మోసపోయారు. ఈ ఆన్లైన్ స్కామ్‌లో ఆమె ఏకంగా రూ. 72 లక్షలు పోగొట్టుకున్నారు. బాధితురాలికి ఆర్బీఐ అధికారిగా చెప్పుకున్న ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
భద్రతా కారణాలతో ఆమె క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందని నిందితుడు ఆమెను నమ్మబలికాడు. ఆపై వృద్ధురాలు తన కార్డును అన్‌బ్లాక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ ప్రక్రియలో స్కామర్లు ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ. 72 లక్షలు కాజేశారు. ఆగస్ట్ 23న ఓ వ్యక్తి నుంచి ఆమె ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నారు. తాను ఆర్బీఐ అధికారినని స్కామర్ పరిచయం చేసుకుని బాధితురాలి క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందని నమ్మబలికాడు.
ఆపై సీబీఐ అధికారి అంటూ మరో వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. ఆమెపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదైందని భయపెట్టాడు. ఫేక్ ఎఫ్ఐఆర్ కాపీలను చూపి బెదిరించారు. విచారణ పేరుతో ఆమె బ్యాంకు ఖాతా వివరాలను రాబట్టారు. నిందితులను నమ్మిన వృద్ధురాలు వారు అడిగిన కీలక సమాచారం ఇవ్వడంతో ఆమె ఖాతాల నుంచి రూ. 72 లక్షలు తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
Read More :
Kangana Ranaut | నా సినిమాపై ‘ఎమర్జెన్సీ’ విధించారు.. సినిమా విడుదలలో జాప్యంపై కంగన