న్యూఢిల్లీ : ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా సైబర్ నేరాలకు (Cyber Fraud) బ్రేక్ పడటం లేదు. వినూత్న మార్గాల్లో స్కామర్లు అమాయకుల బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము ఇట్టే కాజేస్తున్నారు. లేటెస్ట్గా మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన 44 ఏండ్ల మహిళను వర్క్ ఫ్రం హోం జాబ్ పేరుతో మభ్యపెట్టిన కేటుగాళ్లు ఏకంగా రూ. 15 లక్షలు కొట్టేశారు. నాసిక్‌లోని కెనడా కార్నర్లో నివసించే మహిళను ఏప్రిల్ 25న వాట్సాప్‌లో గుర్తుతెలియని వ్యక్తి సంప్రదించి వర్క్ ఫ్రం హోం జాబ్ ఆఫర్ ఉందని నమ్మబలికాడు.
జాబ్‌ను పొందే క్రమంలో పలు బ్యాంకు ఖాతాలకు స్కామర్లు మహిళ నుంచి డబ్బును ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆపై వర్క్‌ను అసైన్ చేసి దీనిపై పెద్ద మొత్తంలో రిటన్స్ వస్తాయని మభ్యపెట్టి మరికొంత నగదు ఆయా ఖాతాల్లో జమ చేయించుకున్నారు. స్కామర్లను మహిళ పూర్తిగా నమ్మిందని నిర్ధారించుకున్న తర్వాత డాక్యుమెంటేషన్, ఇతర టాస్క్‌ల పేరుతో పెద్దమొత్తంలో డబ్బు దండుకున్నారు.
పలు ఖాతాల్లో బాధితురాలి నుంచి రూ. 15 లక్షలు పైగా వసూలు చేశారు. స్కామర్లు పదేపదే డబ్బు అడుగుతుండటంతో మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.
Read More :