Health Tips | ఈ ఆహారంతో శరీరంలో ఇన్ఫ్లమేషన్కు చెక్
వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు శరీరం ప్రతిస్పందించడంలో భాగంగా ఇన్ఫ్లమేషన్ (వాపు ప్రక్రియ) తలెత్తుతుంది. అయితే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ (Health Tips) పలు అనారోగ్యాలకు దారితీస్తుంది.
న్యూఢిల్లీ : వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు శరీరం ప్రతిస్పందించడంలో భాగంగా ఇన్ఫ్లమేషన్ (వాపు ప్రక్రియ) తలెత్తుతుంది. అయితే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ (Health Tips) పలు అనారోగ్యాలకు దారితీస్తుంది. ఆరోగ్యకర ఆహారం, మెరుగైన జీవనశైలితో ఇన్ఫ్లమేషన్ను నివారించవచ్చు. ఏడు ఆహార పదార్ధాలతో ఇన్ఫ్లమేషన్కు చెక్ పెట్టవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణులు అంజలీ ముఖర్జీ సూచిస్తున్నారు.
యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బెర్రీస్‌తో ఇన్ఫ్లమేషన్ను నియంత్రించవచ్చు. సాల్మన్ వంటి ఫ్యాటీ ఫిష్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే మెరుగైన ఫలితం లభిస్తుంది. ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే బాదం, వాల్నట్స్, చియా సీడ్స్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో వాపు ప్రక్రియను కట్టడి చేయవచ్చని ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో అంజలీ ముఖర్జీ రాసుకొచ్చారు.
ఇన్ఫ్లమేషన్ లెవెల్స్‌ను తగ్గించుకోవాలంటే తరచూ ఆకుకూరలను తీసుకోవాలి. పసుపు, అల్లం, వెల్లుల్లి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్‌గా పనిచేస్తాయి. ఈ సూచనలతో పాటు రోజూ తగినంత మంచినీరు తాగడం అలవరుచుకుంటే ఇన్ఫ్లమేషన్ను నివారించవచ్చని న్యూట్రిషియనిస్ట్ అంజలీ ముఖర్జీ చెబుతున్నారు.
Read More :
Kinesio Tape | కండరాల గాయాల నుంచి కాపాడే పట్టీ.. దీన్ని వేసుకుంటే నొప్పి ఇట్టే తగ్గుతుందట!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

