రాజ్‌కోట్ : తన పొలంలో పనిచేసే వ్యవసాయ కూలీ భార్యపై కన్నేసిన భూస్వామి ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో బాధితురాలు తనువు చాలించిన ఘటన గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో జరిగింది. వాద్వన్ తాలూకాలో జరిగిన ఈ ఘటనలో బాధితురాలు మంగళవారం బలవన్మరణానికి పాల్పడింది.
నిందితుడు యువరాజ్‌సింగ్ పర్మార్ మహిళను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో మనస్ధాపానికి గురైన మహిళ పొలంలోనే ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర గాయాలపాలై దవాఖానలో చికిత్స పొందుతూ మరణించింది. భర్త ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు గత కొంతకాలంగా మహిళను తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.