న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం జరిగింది. సెంట్రల్ ఢిల్లీ ఐటీఓ ప్రాంతంలో ఆటో డ్రైవర్ సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం కశ్మీరీ గేట్‌కు వెళ్లేందుకు ఖజురిఖాస్‌లో మహిళ (27) ఆటో ఎక్కగా ఐటీఓ ప్రాంతంలో ఆటోడ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఆపై బాధితురాలిని ఆటోడ్రైవర్ కశ్మీరీ గేట్ వద్ద డ్రాప్ చేసి పరారయ్యాడు. యూపీలోని సంభాల్‌కు చెందిన బాధితురాలు పనినిమిత్తం ఢిల్లీ వచ్చిందని పోలీసులు తెలిపారు. తనను ఐటీఓ-యమున బ్రిడ్జి సమీపంలోని ఓ రూమ్‌కు తీసుకువెళ్లి అక్కడ నిందితులు దారుణానికి ఒడిగట్టారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మహిళ ఆరోపించింది. ఆటోడ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసుల మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.