న్యూఢిల్లీ : ఆన్లైన్లో పార్ట్‌టైం జాబ్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు (cyber fraud ) చెలరేగుతూ అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా నోయిడాకు చెందిన ఓ మహిళను వాట్సాప్‌లో సంప్రదించిన స్కామర్లు పార్ట్‌టైం జాబ్ ఆఫర్ పేరుతో ఏకంగా రూ. 4.3 లక్షలను కాజేశారు. వాట్సాప్‌లో మహిళను సంప్రదించిన స్కామర్లు యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం ద్వారా పెద్దమొత్తంలో ఆర్జించవచ్చని నమ్మబలికారు.
పలు ఈకామర్స్ వెబ్‌సైట్స్‌కు చెందిన వీడియోలను లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్‌స్క్రైబ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని మహిళను మభ్యపెట్టారు. ఆపై టెలిగ్రాం గ్రూపులో మహిళతో కెన్ట్ అయి ఆమెకు పలు టాస్క్‌లు ఇచ్చారు. తొలుత ఆమె నమ్మకాన్ని చూరగొనేందుకు స్కామర్లు కొన్ని టాస్క్‌లకు కొంత మొత్తం ముట్టచెప్పారు.
ఆపై ప్రైమ్ టాస్క్ పేరుతో వల వేసిన స్కామర్లు మహిళ నుంచి రూ. 4.38 లక్షలు స్వాహా చేశారు. తన ఖాతాలో జమయిన డబ్బును డ్రా చేసుకునేందుకు మళ్లీ పెట్టుబడి పెట్టాలని దానికి మెరుగైన రిటన్స్ వస్తాయంటూ మహిళను బురిడీ కొట్టించారు. ఆపై తాను మోసపోయానని గుర్తించిన మహిళ సెక్టార్ 58 నోయిడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు చేపట్టింది.
Read More
Fake Parcel Scam | విదేశాల నుంచి విలువైన బహుమతులు వస్తున్నాయా? అంత ఈజీగా నమ్మేయకండి