ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. ముంబైలోని మలద్‌లో ఎస్కార్ట్ సర్వీస్‌కు చెందిన మహిళ (23)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మలద్‌లోని నిందితుడి గృహంలో ముగ్గురు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత మహిళ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు రూ .10,000 చెల్లించి మహిళను రాత్రి తనతో గడపాలని మాట్లాడుకున్నాడు. ఆపై మొత్తం ముగ్గురు వ్యక్తులతో గడపాలని కోరాడు. అనంతరం రూ. 30,000 చెల్లించాలని ఆమె కోరగా రూ 10,000 చేతిలో పెట్టారు.
మొత్తం డబ్బు ఇచ్చే వరకూ కదలనని మహిళ మొరాయించడంతో ఆమెపై దాడి చేసి బయటకు నెట్టివేశారు. ఈ ఘటనకు సంబంధించి మహిళ ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు వ్యక్తులపై సామూహిక లైంగిక దాడి కేసు నమోదు చేశామని మలద్ ఎస్ఐ ధనంజయ్ లిగాదె తెలిపారు.