మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 26, 2020 , 20:13:46

భర్త కోసం భార్య ఆందోళన..ఇంటి ముందే వంటావార్పు

భర్త కోసం భార్య ఆందోళన..ఇంటి ముందే వంటావార్పు

ఖమ్మం : తాళి కట్టిన భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ భార్య ఆందోళనకు దిగిన సంఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం..ఖమ్మం రురల్ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన కీర్తి (28) కి, ఖమ్మం నగరంలోని సుగ్గలవారితోట ప్రాంతానికి చెందిన జాలాది నరేందర్ కు గత 2016, నవంబర్ నెలలో వివాహం జరిగింది. వారికి ఏడాదిన్నర తర్వాత బాబు పుట్టాడు. పురిటి కోసం పుట్టింటికి వచ్చిన కీర్తిని ఆమె భర్త నరేందర్ కనీసం పలకరించలేదు. 

అనుమానం వచ్చిన కీర్తి ఒక పెద్ద మనిషి ద్వారా కబురు పెట్టగా కాపురానికి రమ్మన్నాడు. కానీ బాబుని వదిలేసి రావాలంటూ షరతు విధించాడు. భర్త మాటకు కట్టుబడి తన కుమారుడిని పుట్టింట్లో వదిలేసి హైదరాబాద్ వెళ్లింది. మూడు నెలల అనంతరం వారి కాపురంలో కలతలు తిరిగి ప్రారంభమయ్యాయి. తట్టుకోలేని కీర్తి తిరిగి పుట్టింటికి వెళ్లింది. మూడేండ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా..  ఆమె భర్తలో మార్పు రాకపోవడంతో  ఐదు రోజుల క్రితం ఖమ్మంలోని అతడి ఇంటికి వచ్చింది.  

తన భర్త, అత్తమామలు ఆమెను కొట్టి ఇంటికి తాళం వేసుకుని వెళ్లారు. అయినప్పటికీ తన భర్త కోసం చంటి బిడ్డను ఎత్తుకుని అక్కడే ఆందోళనకు దిగింది. ఇరుగుపొరుగు వారు ఇచ్చిన వంట సామాన్లతో అన్నం వండుకుని, మూడేండ్ల బాబుతో కలిసి వరండాలోనే ఉంటున్నది. పోలీసులు వచ్చి కేసు పెట్టమని అడిగినా తనని కాపురానికి తీసుకెళ్తే  చాలు, కేసు వద్దని చెప్పింది. ఈ విషయం తెలిసి పలు మహిళా సంఘాలు ఆమెకు బాసటగా నిలిచాయి.logo