Sangareddy | సంగారెడ్డి : జిల్లా పరిధిలోని ఆందోల్ మండలంలోని నాదులాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్యను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి పోలీసులు చేసుకున్నారు.
మృతులను నారాయణ, మల్లమ్మగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమాట్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ వివాదాల వల్లే నారాయణ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.