హైదరాబాద్‌లో దారుణం.. భార్యను చంపి ఆపై భర్త ఆత్మహత్య
hyderabad | హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. బీ రాజు(35), బీ కవిత(33) అనే ఇద్దరు దంపతులు రాజీవ్ గాంధీ నగర్లో నివాసముంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. గురువారం ఉదయం కూడా దంపతుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన భర్త ఆవేశంతో ఊగిపోయాడు. కత్తితో ఆమె గొంతును కోసేశాడు. ఆమె ప్రాణాలు కోల్పోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. రాజు వేరే గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు.
స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్న చిన్న విషయాలకే రాజు గొడవపడేవాడని కవిత కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

