అమరావతి : కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మోపిదేవి మండలం కాశానగర్ వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. చల్లపల్లి మండలం చింతలమడ నుంచి వివాహనానికి కాశానగర్కు వెళ్తుతున్న పెళ్లి బృందం వాహనం రోడ్డు పక్కన నెలకొల్పిన ఫ్లెక్సీ అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని చింతల మడ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.