Watch: ఈటరీ ఫుడ్‌లో బల్లి… వ్యక్తి ఫిర్యాదుపై స్పందించిన అధికారులు
చండీగఢ్: ఒక ప్రముఖ ఈటరీలో సర్వ్ చేసిన ఫుడ్ ప్లేట్లో సజీవంగా ఉన్న బల్లి కనిపించింది. దీంతో ఒక వ్యక్తి ఫిర్యాదుతో అధికారులు స్పందించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. ఎలాంటే మాల్లోని సాగర్ రత్న ఫుడ్ కోర్ట్ అక్కడ చాలా ఫేమస్. గురీందర్ చీమా అనే వ్యక్తి మంగళవారం అక్కడకు వెళ్లాడు. ఫుడ్ ఆర్డర్ చేసిన ఆయనకు భయానక అనుభవం ఎదురైంది. అక్కడి ప్రసిద్ధమైన చోలే భాతురేను ఆర్డర్ చేశాడు. అయితే దానిని సర్వ చేసిన ప్లేట్లో కొంత బతికి ఉండి కదులుతున్న బల్లి కనిపించింది.
ఇది చూసి షాకైన గురీందర్, వెంటనే చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం ఆహార, ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. స్పందించిన సంబంధిత అధికారులు వెంటనే ఆ ఫుడ్ కోర్ట్‌కు వచ్చారు. గురీందర్కు సర్వ్ చేసిన ప్లేట్లోని ఆహార నమూనాలను పరీక్ష కోసం సేకరించారు.
కాగా, తనకు ఎదురైన చేదు అనుభవవాన్ని గురీందర్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. స్థానిక బీజేపీ నేత రవి రాయ్ రాణా కూడా దీనికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి వైరల్ అయ్యాయి. దీంతో ఫుడ్ కోర్టుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడ్డారు. వినియోగదారులు చాలా జాగ్రతగా ఉండాలని కొందరు పలు సూచనలు చేశారు.
Had a very horrible experience on 14.6.22, at Sagar Ratan, food court, Elante Mall, Chandigarh. A live Lizard was found in semi-conscious state under the Bhatura. Complaint given to @DgpChdPolice they made samples seized by food health Dept. Chd.@nagarkoti @Nainamishr94 pic.twitter.com/CTkvsnzTDP
— Cheema_22 (@GurinderCheema1) June 15, 2022
Had a very horrible experience on 14.6.22, at Sagar Ratan, food court, Elante Mall, Chandigarh. A live Lizard was found in semi-conscious state under the Bhatura. Complaint given to @DgpChdPolice they made sample seized by food health Dept. Chd. @KirronKherBJP@DoctorAjayita pic.twitter.com/ej4sLHrnH5
— Triple R (@RaviRRana) June 15, 2022
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

