సవతి తల్లిగా మాజీ భార్య.. యూపీ వ్యక్తి షాక్

లక్నో: మాజీ భార్య సవతి తల్లి అయ్యిందన్న విషయం తెలుసుకుని ఒక వ్యక్తి షాక్ అయ్యాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్లోని బడాన్లో ఈ ఘటన జరిగింది. 2016లో మైనర్లైన ఒక జంటకు పెండ్లి జరిగింది. ఆరు నెలల తర్వాత వారిద్దరు విడిపోయారు. మేజర్ అయిన తర్వాత కలిసి ఉండేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించగా ఆ యువతి నిరాకరించింది. అతడ్ని తాగుబోతుగా ఆరోపించి విడాకులు డిమాండ్ చేసింది.
మరోవైపు పారిశుధ్య కార్మికుడిగా పని చేసే ఆ వ్యక్తి తండ్రి కొంత కాలంగా అతడికి డబ్బులు ఇవ్వడం లేదు. ఆయన సంభల్లో విడిగా ఉంటున్నాడు. దీంతో ఆ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా తన 48 ఏండ్ల తండ్రి గురించి సమాచారం కోరాడు. తన మాజీ భార్యను తండ్రి పెండ్లి చేసుకున్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. దీనిపై బిసౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ నేపథ్యంలో పోలీసులు శనివారం ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. కాగా, సవతి తల్లిగా మారిన మాజీ భార్య మొదటి భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. అతడి తండ్రిని పెండ్లి చేసుకున్న తాను సంతోషంగా ఉన్నట్లు పోలీసులకు చెప్పింది. దీంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. మొదటి పెండ్లికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ఆరా తీశారు. మరోసారి పిలిపించి మాట్లాడతామని చెప్పి వారిని పంపివేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

