మారేడ్పల్లి : రైలు పట్టాల పక్కన వేప చెట్టుకు ఉరి వేసుకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సికిం ద్రాబాద్-జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ల మధ్యన గుర్తు తెలియని వ్యక్తి పట్టాల పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుని వయసు సూమారు 30-35 సంవత్సరాలు ఉంటాయని, ఒంటి పై తెలుపు, నలుపు గీతల చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. మృతుని సంబంధీకులు ఏవరైనా ఉంటే సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.