పాట్నా : బిహార్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందగా.. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. నలంద ప్రాంతంలోని బెనా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్నది. భక్తియార్పూర్-రాజౌలి రహదారి నిర్మాణ పనుల్లో ఓవర్ బ్రిడ్జి చాలా భాగం కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. నాలుగు లైన్ల వెంతన నిర్మాణం జరుగుతోందని బీడీఓ లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారనే విషయంపై స్పష్టత లేదని అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.