పరిగి టౌన్ : గుర్తు తెలియని మహిళా మృతిచెందిన సంఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలోని రంగాపూర్ గ్రామ స్టేజీ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40సంవత్సరాల వయస్సు గల ఓ మహిళా గ్రామ స్టేజి సమీపంలో ఫుట్‌పాత్‌పై మృతిచెందినట్లు గ్రామ కార్యదర్శి విశ్వతేజ తెలిపారు.
ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా ఒంటిపై నారింజరంగు చీర, నీలిరంగు రంగు జాకేట్ ఒంటిపై కలిగి ఉందని శరీరంపై ఎలాంటి గాయాలు లేవని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.