న్యూఢిల్లీ : భారీ డ్రగ్ రాకెట్‌ను భగ్నం చేసిన అధికారులు ఉగాండా జాతీయుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు రాబర్ట్ సెగోంజి రూ 7 కోట్ల విలువైన 30 హెరాయిన్ ట్యాబ్లెట్లను మింగేశాడు. రాబర్ట్ ఆట కట్టించిన పోలీసులు అతడిని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 14న రాబర్ట్‌ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
రాబర్ట్ కదలికలపై అనుమానం వచ్చిన అధికారులు అతడిని అడ్డగించారు. విచారణలో భాగంగా హెరాయిన్‌తో కూడిన 30 ట్యాబ్లెట్లను మింగేశానని నిందితుడు అంగీకరించాడు. 18 క్యాప్పుల్స్ను ఎయిర్‌పోర్ట్‌లోనే నిందితుడు విసర్జించగా, మిగిలిన 12 క్యాప్సుల్స్‌ను రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో కక్కించారు.
మొత్తం ఏడు కోట్ల విలువైన హెరాయిన్‌ను నిందితుడి నుంచి అధికారులు సీజ్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు కోర్టులో హాజరుపరిచి అనంతరం తీహార్ జైలుకు తరలించారు.