కొత్తగూడెం : జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం వద్ద వేగంగా వచ్చిన లారీ బైకును ఢీకొనగా ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన సంతోష్ ( 19) , సందీప్ ( 20) అనే యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.