లక్నో: పబ్ వద్ద ఒక వ్యక్తిపై ఇద్దరు మహిళలు దాడి చేశారు. అందులోని ఒక మహిళ మరింత రెచ్చిపోయింది. అక్కడి పూల కుండీలతో అతడ్ని కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమ్మిట్ బిల్డింగ్ 15వ అంతస్తులో ఒక పబ్ ఉంది. దీని వెలుపల గురువారం రాత్రి ఒక వ్యక్తిపై ఇద్దరు మహిళలు దాడి చేశారు. ఒక మహిళ అతడ్ని ఎడాపెడా చితక బాదింది. అలాగే అక్కడ ఉన్న పూల కుండీలతో ఆ వ్యక్తిని కొట్టింది.
ఇంతలో బౌన్సర్లు జోక్యం చేసుకున్నారు. మహిళ పట్టు నుంచి ఆ వ్యక్తిని విడిపించారు. ఇద్దరినీ చెరో వైపునకు తీసుకెళ్లారు. కాగా, అక్కడ ఉన్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో ఇదంతా రికార్డు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో స్పందించారు. ఆ వ్యక్తిని కొట్టిన ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఆ వ్యక్తి మాత్రం పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
మరోవైపు బహుళ అంతస్తులున్న ఆ బిల్డింగ్‌లో పలు పబ్‌లు ఉన్నాయి. దీంతో అక్కడ తరచుగా గొడవలు, ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో గతంలో అక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు.
लखनऊ अनप्लग्ड कैफे के बाहर चले लात-घूंसे, लड़की ने एक शख्स को जमकर पीटा #Video Viral #Lucknow #UnpluggedCafe @Live_Hindustan pic.twitter.com/r8Ks3cVQAI
— Hindustan UP-Bihar (@HindustanUPBH) July 22, 2022