వానల్లో డ్రైగా ఉండాలంటే..!
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల డ్రై ఫ్రూట్స్ మెత్తబడతాయి. బూజు పట్టడం, పురుగులు పట్టడం లాంటి సమస్యలు వస్తాయి. అయితే, వానకాలంలో డ్రై ఫ్రూట్స్ తాజాగా, క్రిస్పీగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల డ్రై ఫ్రూట్స్ మెత్తబడతాయి. బూజు పట్టడం, పురుగులు పట్టడం లాంటి సమస్యలు వస్తాయి. అయితే, వానకాలంలో డ్రై ఫ్రూట్స్ తాజాగా, క్రిస్పీగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.
- బాదం, వాల్నట్స్, పిస్తా, జీడిపప్పు లాంటివి బయటి వాతావరణంలో త్వరగా పాడవుతాయి. వీటిని ఎయిర్ టైట్ కంటెయినర్లు, జిప్‌లాక్ బ్యాగుల్లో పోసి.. ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
- జీడిపప్పు, బాదం, పల్లీలను స్టవ్ మీద దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత డబ్బాలో భద్రపరిస్తే.. తేమ చేరకుండా క్రిస్పీగా ఉంటాయి.
- డ్రై ఫ్రూట్స్‌ను ప్లాస్టిక్ కవర్లలో ఉంచకుండా.. గాజు సీసాలు, నాణ్యమైన ఎయిర్‌టైట్ కంటైనర్లలో నిల్వ చేయాలి. తేమ తగలకుండా డబ్బా మూతలను గట్టిగా బిగించాలి.
- డ్రై ఫ్రూట్స్ నిల్వ చేసే డబ్బాలో రెండుమూడు లవంగాలు లేదా ఓ రెండు బిర్యానీ ఆకులు వేసి ఉంచాలి. వీటినుంచి వచ్చే ఘాటైన వాసనకు.. పురుగులు, చీమలు పట్టకుండా ఉంటాయి.
- డబ్బా మూత లోపలి భాగంలో లేదా డబ్బాలో ఫుడ్‌గ్రేడ్ సిలికా జెల్ ప్యాకెట్ ఉంచాలి. ఇది తేమను పీల్చుకుని డ్రై ఫ్రూట్స్ మెత్తబడకుండా చేస్తుంది.
- డబ్బాల్లోంచి డ్రై ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు చేతులు తడిగా లేకుండా చూసుకోవాలి. పూర్తిగా పొడిగా ఉన్న చెంచాలనే ఉపయోగించాలి.
- ర్షాలు తగ్గి ఎండ వచ్చినప్పుడు.. డ్రై ఫ్రూట్స్‌ను శుభ్రమైన క్లాత్‌పై పరిచి, కాసేపు ఎండలో ఉంచితే వాటిలోని తేమ పూర్తిగా తొలగిపోతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

