తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ఫీచర్లతో మొబైల్స్ అందించే ఇన్ఫినిక్స్ సంస్థ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. తన సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ ‘ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో’ను ఇటీవలే విడుదల చేసింది. మెరుగైన గేమింగ్, భారీ బ్యాటరీ, ఆకట్టుకునే డిస్ప్లే కోరుకునే నవతరం వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను రూపొందించింది. ఇందులో ఆధునిక పంచ్-హోల్ డిజైన్‌తో కూడిన 6.76 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. దీనివల్ల సోషల్ మీడియా స్క్రోలింగ్, వీడియోలు చూడటం, గేమింగ్ అనుభవం ఎంతో స్మూత్‌గా సాగిపోతుంది. అవుట్‌డోర్‌లో కూడా స్క్రీన్‌ను స్పష్టంగా చూడటానికి డిస్ప్లే బ్రైట్నెస్ అనువుగా ఉంటుంది. ఇక పనితీరు, ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఇందులో శక్తిమంతమైన మీడియా టెక్ డైమెన్సిటీ 7100 ఆక్టా-కోర్ 5జీ ప్రాసెసర్‌ను అమర్చారు.
గ్రాఫిక్స్ నిర్వహణ కోసం మాలీ-జీ610 జీపీయూను ఏర్పాటుచేశారు. ఇది రోజువారీ మల్టీ టాస్కింగ్, భారీ యాప్‌ల వినియోగం, సాధారణ గేమింగ్‌ను ఎలాంటి ల్యాగ్ లేకుండా నడిపిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉన్నది. ఇది పగటి వెలుతురులో స్పష్టమైన చిత్రాలను, 2కె రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేయగలదు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ ముఖ్యమైన ప్రత్యేకత దీని భారీ బ్యాటరీ సామర్థ్యం. ఇందులో 6000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. దీనిని వేగంగా చార్జ్ చేయడానికి 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందిస్తున్నారు. బ్లూటూత్ 5.4, వై-ఫై, యూఎస్బీ టైప్-సి పోర్ట్, డస్ట్-వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 68 రేటింగ్ లాంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 6 జీబీ+128 జీబీ, 8 జీబీ +256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో స్మార్ట్ యూజర్ల హాట్ ఎంపిక