అమీర్‌పేటలో ఇద్దరు వృద్ధ మహిళల కిడ్నాప్.. అమీన్పూర్లో నిర్బంధం

అమీర్‌పేటలోని ధరకరం రోడ్డు ప్రాంతానికి చెందిన ఇద్దరు వృద్ధ మహిళలను కిడ్నాప్ చేసి అమీన్పూర్లో బంధించిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వృద్ధులను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం వారిని అమీన్‌పూర్‌లోని ఓ ఇంట్లో బంధించారు. వారిద్దరు కేకలు వేయడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని రక్షించి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అనంతరం అమీన్పూర్ పీఎస్ నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కేసును బదిలీ చేశారు. అయితే కిడ్నాప్ చేసిన దుండగులు కీలకమైన ల్యాండ్ డాక్యుమెంట్లు, కొంత బంగారాన్ని తీసుకువెళ్లారని బాధితులు చెబుతున్నారు. మీరాజ్ అహ్మద్ ఖురేషి అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మీరాజ్‌తో పాటు మరో నలుగురిపై కిడ్నాప్, దాడి కేసులను నమోదు చేశారు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. కాగా ధరంకరం రోడ్డులో ప్రస్తుతం వృద్దులు నివాసం ఉంటున్న కోట్లాది రూపాయల విలువచేసే స్థలం కోసమే ఈ కిడ్నాప్ జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- ameerpet
- aminpur
- Kidnap
- old womens
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

