Sangareddy | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండల పరిధిలో దారుణం జరిగింది. బర్ధిపూర్ గ్రామ సమీపంలో ఉపాధి హామీ కూలీలపై ఓ అడవి పంది దాడి చేసింది. అడవి పంది దాడిలో ఓ ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
కూలీలంతా పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో అడవి పంది దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన నర్సింహులు(55), రుక్కమ్మ(52)ను చికిత్స నిమిత్తం జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నర్సింహులు కాలు ఫ్రాక్చర్ అయింది. బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.