మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 20, 2020 , 12:44:19

గుర్తు తెలియని వాహనం ఢీకొని..ఇద్దరు మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని..ఇద్దరు మృతి

వికారాబాద్ : జిల్లాలోని బొంరాస్పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన బోయిని హన్మంతు(37), మంగలి అంజిలయ్య(39) భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి పనులు ముగించుకుని బైకుపై ఇంటికి వెళ్తుండగా.. తుంకిమెట్ల సమీపంలో వీరి బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తవ్ర గాయాలైన హన్మంతు సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. అంజిలయ్యను చికిత్స కోసం మహబూబ్ నగర్ దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. హన్మంతుకు ముగ్గురు కొడుకులు, అంజిలయ్య కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. వీరి మృతి ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రమాదం రాత్రి 9.30 గంటల సమయంలో చోటు చేసుకుంది.logo