అమరావతి : ఏపీలోని అనకాపల్లి ( Anakapalli ) జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మునగపాక మండలం అరబుపాలెం, మూలపేట గ్రామానికి చెందిన బంధువులు కారులో భద్రాచలం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై పార్కింగ్ చేసిన లారీని ఢీ కొన్నారు.
ఈ ఘటనలో కారులో ఉన్న ఆడారి కూర్మారావు, జ్యోతి అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.