చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. చందుర్తి మండలం మూడపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. రుద్రంగి నుంచి వేములవాడకు వస్తుండగా.. మూడపల్లి మూలమలుపు వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
మృతులను రుద్రంగి మండలవాసులుగా గుర్తించారు. లారీ ఎరువుల లోడ్‌తో కోరుట్ల వైపు వెళ్తున్న సమయంలో కారు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. సమాచారం అందుకున్న చందుర్తి సీఐ కిరణ్‌కుమార్, ఎస్ఐ రమేశ్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులను రుద్రంగి మండల కేంద్రంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న దూంపేట గ్రామానికి చెందిన నవీన్‌తో పాటు రుద్రంగి గ్రామానికి చెందిన అంబటి కిశోర్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.