సోమవారం 18 జనవరి 2021
Crime - Jan 13, 2021 , 15:18:57

విహారంలో విషాదం..ముగ్గురి దుర్మణం

విహారంలో విషాదం..ముగ్గురి దుర్మణం

మెదక్‌ : విహారం వారి పాలిట విషాదంగా మారింది. ప్రకృతి అందాలను తిలకించి పులకించాలన్నా వారి ఆశలు అడియాసలయ్యాయి. వారి విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ముగ్గురు మృత్యు ఒడికి చేరారు. ఈ హృదయవిదారకర సంఘటన మెదక్‌ జిల్లాలో జరిగింది. మెదక్‌ పట్టణానికి చెందిన యువకులు సోఫిక్‌, జమీర్‌, సమీర్‌ పుల్కల్ మండలంలోని సింగూరు డ్యామ్ చూసేందుకు బయల్దేరారు.

మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా జమీర్‌, సమీర్‌ మృతి చెందారు. సోఫిక్‌ను హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ నాగలక్ష్మి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

సాగు చ‌ట్టాల కాపీల‌ను త‌గులబెట్టిన రైతులు

తుపాకీ కాల్పుల్లో ఇండిగో మేనేజర్‌ మృతి