అమరావతి : వరిగడ్డి తరలిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వేలమూరిపాడు వద్ద ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.
స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం అద్దంకికి తరలించారు.
మృతుడు, క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి