జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టిప్పర్ ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని టేకుమట్ల మండలం ఆరెపెళ్లి -గుమ్మడవెల్లి గ్రామాల మధ్యలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు.
మృతుడు పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం నిత్యం పేట గ్రామానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కంగనా పరువాల విందు.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్
సిద్ధాపూర్లో గంజాయి మొక్కలు ధ్వంసం
థియేటర్స్‌లోకి రాబోతున్న మరో రెండు సినిమాలు