జగిత్యాల : జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో భారీ పిడుగు పడింది. బండారి గిర్ని వెనుకాల పిడుగు పడటంతో.. చాలా మంది ఇండ్లలో ఉన్న టీవీలు, అడాప్టర్లో కాలిపోయాయి. ఓ ఇంటి పైకప్పు గోడ పగిలిపోయింది. టీవీలు, అడాప్టర్లు కాలిపోవడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పిడుగు పడిన ప్రాంతాన్ని స్థానికులు పరిశీలించారు. వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు తమ టీవీలను, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను బంద్ చేసి ఉంచాలని అధికారులు సూచించారు.