e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home News వరంగల్‌లో ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు

వరంగల్‌లో ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు

వరంగల్‌ : భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు స్మగ్లర్ల ముఠాను శుక్రవారం టాస్క్ ఫోర్స్‌, జనగాం పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసారు. ముఠా సభ్యుల నుంచి నూమారు రూ.12 లక్షల 60వేల విలువగల 126 కిలోల గంజాయితో పాటు, ఒక కారు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను మీడియాకు వెల్లడించారు.

గంజాయిని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు జనగాం నుంచి హైదరాబాదు వెళ్లే మార్గం పట్టుపురుగుల పెంపకం కేంద్రం వద్ద తనిఖీలు నిర్వహించారు. పోలీసులను చూసి నిందితులు కారులో తప్పించుకోనిపోయేందుకుగా ప్రయత్నించారు. పోలీసులు ఆప్రమత్తమై కారును ఆపి తనిఖీ చేసి కారులో గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు.

- Advertisement -

కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా తాము పాల్పడిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించారని సీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ప్రతాప్‌ కుమార్, ఇన్‌స్పెక్టర్‌ మధు, జనగాం ఇన్ స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, జనగాం ఎస్.ఐ రవికుమార్, ఏఏవో సల్మాన్‌ పాషా, టాస్క్‌ఫోర్స్‌ హెడ్ కానిస్టేబుల్ సామలింగం, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాజు, మీర్ మహమ్మద్ ఆలీ, రాజేష్, శ్రవణ్, చిరులను పోలీస్ కమిషనర్ అభినందించారు.

ఇవి కూడా చదవండి..

చెరువులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం

పల్లె ప్రగతికి సహకరిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం

న్యూజిలాండ్ సెల‌బ్రేష‌న్స్ చూసి త‌ట్టుకోలేక‌పోయాం: అశ్విన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement