మోపాల్ : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలోని కులాస్పూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న ఆరు ఇండ్లలో దొంగతనం జరిగింది. . సీఐ రవి, ఎస్సై సాయిరెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు .. గ్రామంలోని సునీత అనే మహిళ ఇంట్లో 17 తులాల బంగారం, రూ. 6లక్షల నగదు, ఐదు తులాల వెండి, మిగతా ఇళ్లలో కొంత బంగారం, నగదు దొంగలించినట్లు తెలిపారు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకుని క్లూస్ టీమ్, సీసీ కెమెరాలను పరిశీలించామని తెలిపారు. నిందుతులను వెంటనే పట్టుకుంటామని వారు పేర్కొన్నారు. . బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రజలు ఎక్కడికైనా ఊరికి వెళ్లితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.