అమరావతి : ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో (NTR district) రూ.5.5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది . హైదరాబాద్ (Hyderabad) నుంచి విజయవాడకు (Vijayawada) బంగారం డెలివరీ చేసే క్రమంలో ముగ్గురు వ్యక్తుల కళ్లుగప్పి సినీ ఫక్కీలో కారు డ్రైవర్ పరారయ్యాడు.
జగ్గయ్యపేట వద్ద టీ కోసం ఆగిన సమయంలో కారుతో సహా డ్రైవర్ (Driver) పారిపోయాడు. కారుకు జీపీఎస్ ట్రాకర్ ఉండటంతో నిందితుడు నందిగామ వద్ద కారు వదిలి వెళ్లిపోయాడు. బంగారు దుకాణంలో పనిచేసే మిగతా ముగ్గురు ఉద్యోగులు నందిగామ ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కారు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.