హిమాయత్‌నగర్ : ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ యువతి అదృ శ్యమైన సంఘటన నారాయణగూడ పీఎస్ పరిదిలో చోటు చేసుకుంది. సీఐ భూపతి గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం హిమాయత్‌నగర్‌లో నివాసం ఉండే కొమురయ్య కుమార్తె అనూష (20) ఈ నెల 19న బయటకు వెళ్లింది.
సాయంత్రమైన తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువుల ఇండ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని అదృశ్యమైన యువతి అచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సై జ్యోతి కేసును దర్యాప్తు చేస్తున్నారు.