గోల్నాక, ఆగస్టు 16 : చిన్నప్పడుడే తలిదండ్రులు మృతి చెందడంతో అనాధగా జీవనం గడుపుతూ ఒంటిరితనం భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పెందుర్తికి చెందిన గణేష్ (23) చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో తన మామ సంరక్షణలో పెరిగాడు.ఐటీఐ వరకు చదివిన గణేష్ గత కొంత కాలం క్రితం ఉద్యోగ నిమిత్తం అంబర్‌పేట పటేల్‌నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని బోడుప్పల్ బిగ్‌బజార్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
తనకు ఎవరూ లేరని తీవ్రమనస్తాపం చెందిన గణేష్ ఆదివారం సాయంత్రం తన గదిలో సీలింగ్ ఫ్యాన్ హుక్కుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.