ఖైరతాబాద్ : పని కోసం వెళ్లిన ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీఎస్ మక్తాలో నివాసం ఉండే సంతోష్ (22) సోమాజిగూడలోని మినర్వా కేఫ్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 13న ఉదయం 5.30గంటలకు విధులకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు.
దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో అతని బంధువు మీనా శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.