నిజామాబాద్ : జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సీసాతో పొడిచి దుండగులు కిరాతకంగా హతమార్చారు. ఈ సంఘటన జిల్లాలోని రెంజల్ మండలం బొర్గం శివారులో గురువారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రెంజల్ మండల కేంద్రానికి చెందిన సాయికుమార్ (25) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా మద్యం సీసాతో గొంతులో పొడిచి చంపి.. మృతదేహాన్ని ముళ్ల పొదల్లో పడేశారు.
హత్యకు గురైన వ్యక్తి బైక్, సెల్ ఫోన్ తీసుకుని పారిపోయారు. సాయికుమార్‌కు గత ఏడాది బాసర మండలం టాక్లి గ్రామానికి చెందిన అనితతో వివాహం జరిగింది.
సంఘటన స్థలాన్ని బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్ఐ సాయన్న చేరుకొని మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించారు. క్లూస్ టీంను రంగంలోకి దించి వివరాలు సేకరిస్తున్నారు.