వెంగళరావునగర్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ మోకానిక్ పై ఎస్.ఆర్.నగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండకు చెందిన హుస్సేన్ ఖాన్ (32) అనే వ్యక్తి ఎల్లారెడ్డిగూడలో ఓ మొకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు.
మొకానిక్ షాపు ఎదురుగా ఉన్న ఇంట్లో బాలిక (17) ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటి వెనుక ఉన్న దారి నుంచి ప్రవేశించి వంట గదిలో ఉన్న బాలిక పట్ల అసభ్యకరంగా వ్వవహరించాడు. దీంతో బాధితురాలు గట్టగా కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు.
బాధితురాలు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.