మూసాపేట, ఏప్రిల్5 : నిర్మాణంలో ఉన్న పెంట్‌హౌస్ స్లాబ్ కూలి నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కూకట్పల్లి సీఐ నర్సింగ్‌రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన సునీల్‌కుమార్, లూత్ మేరీ దంపతులు బతుకుదేరువు కోసం నగరం వచ్చి కూకట్పల్లి హెచ్ఎంటీ హిల్స్ శాతవాహనగర్లో బేకరీ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
వీరికి ఇద్దరు సంతానం. మంగళవారం ఉదయం లూత్మేరీ తన కుమార్తె శారూన్ దీత్య (4)తో కలసి టిఫిన్ కోసం బేకరీ దగ్గరిలో ఉన్న టిఫిన్ సెంటర్ వెళ్లి తిరిగి వస్తుండగా బేకరీ పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం పెంట్‌హౌస్ శ్లాబ్ సెంట్రింగ్ తొలగిస్తుండగా శ్లాబ్ కూలి తల్లి కూమర్తె పై పడడంతో షారున్దీత్య అక్కడికక్కడే మృతి చెందింది. లూత్మేరీకి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటనలో సైకిల్‌పై వెళ్తున్న మరో బాలుడికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, సర్కిల్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి పెంట్‌హౌస్‌ను పూర్తిగా తొలగించారు. సునీల్‌కుమార్ ఫిర్యాదు మేరకు భవనం యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.