వనపర్తి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తకోట మండలం పాలెం గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది.హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ ద్వారా వనపర్తి జిల్లా దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.