
ములుగు : జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే..మంగపేట మండల కేంద్రలోని గంపలగూడెం మార్కెట్ గోడౌన్స్ వద్ద తెల్లవారుజామున ఓ కారు అదుపు తప్పి కల్వర్టు ని ఢీకొట్టింది.
కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ప్రశాంత్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో ఓ శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న వారు రాజన్న సిరిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.