వనపర్తి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఓ కారు ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన పెబ్బేరు పట్టణ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది.
పోలీసుల కథనం మేరకు..పెబ్బేరు నుంచి ఎర్రవల్లి మండలం పరిధిలోని షేక్ పల్లి గ్రామంలో పత్తితీసేందుకు ఆటోలో 15మంది కూలీలు వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న కారు ఆటోను ఢీ కొట్టడంతో 14 మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.