రాజన్న సిరిసిల్ల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పదో తరగతి బాలిక అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అక్షిత (14) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతదేహాన్ని సిరిసిల్ల దవాఖానకు తరలిస్తుండగా వెంకటాపూర్ గ్రామంలో బాలిక అమ్మమ్మ, కుటుంబీకులు అడ్డుకున్నారు.
అమ్మాయిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బాలిక మృతికి కారకులైన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.