బెంగళూర్ : గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు (Cyber Fraud) విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. బెంగళూర్‌కు చెందిన 41 ఏండ్ల టెకీ ఉదయ్ ఉల్లాస్ సోషల్ మీడియా ద్వారా స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ చెక్ చేస్తుండగా సుహాసిని అనే మహిళ పార్ట్‌టైం జాబ్ ఆఫర్‌ను ప్రతిపాదించింది.
స్కీమ్స్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు ఆర్జించవచ్చని ఉల్లాస్‌కు ఆమె నమ్మబలికింది. ముందుగా సింపుల్ టాస్క్‌ల్లో కొద్ది మొత్తం రిటన్స్ పొందడంతో స్కామర్‌ను నమ్మిన ఉల్లాస్ ఆపై రూ. 20 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కాకపోవడంతో విత్‌డ్రా ఫీచర్ అన్‌లాక్ కావాలంటే మరో రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని స్కామర్ ఒత్తిడి చేశాడు.
ఫ్రెండ్స్, బంధువుల నుంచి అప్పుచేసి రూ. 61 లక్షలు ఇన్వెస్ట్ చేసినా వాటిని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు లేకపోవడం, స్కామర్ మొహం చాటేయడంతో మోసపోయానని గుర్తించిన ఉల్లాస్ పోలీసులను ఆశ్రయించాడు.
Read More :
Hyderabad | సూరారంలో డ్రగ్స్ తయారీ ముఠా అరెస్ట్.. మాదక ద్రవ్యాలు సీజ్