సోమవారం 18 జనవరి 2021
Crime - Nov 21, 2020 , 14:22:10

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

ఖమ్మం : ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి చెందింది. ఖమ్మం నగర సమీపంలోని టీ ఎన్జీవోస్ కాలనీకి చెందిన అజ్మీరా జ్యోతి (37) కుమారునితో కలిసి ఖమ్మం నగరంలో కి వస్తుండగా.. కరుణగిరి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు గాయపడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.